యూపీలోని అన్ని ప్రాంతాల్లోనూ భాజపా వెనుకంజ

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అత్యంత వెనుకబడిన బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో భాజపాకు షాక్‌ తగిలింది. రాష్ట్రంలో పశ్చిమ ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి పూర్వాంచల్‌ వరకూ ఉన్న 80 సీట్లలో ఈసారి 33 చోట్లే ఆ పార్టీ విజయం సాధించింది. గత ఎన్నికల్లో 62 చోట్ల గెలిచింది. 

Published : 06 Jun 2024 04:15 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అత్యంత వెనుకబడిన బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో భాజపాకు షాక్‌ తగిలింది. రాష్ట్రంలో పశ్చిమ ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి పూర్వాంచల్‌ వరకూ ఉన్న 80 సీట్లలో ఈసారి 33 చోట్లే ఆ పార్టీ విజయం సాధించింది. గత ఎన్నికల్లో 62 చోట్ల గెలిచింది. 

  • యూపీలోని లోక్‌సభ సీట్లను ఆరు ప్రాంతాలుగా వర్గీకరిస్తారు. అవి పశ్చిమ యూపీ, పూర్వాంచల్, బుందేల్‌ఖండ్, అవధ్, బ్రాజ్, రోహిల్‌ఖండ్‌. 
  • పశ్చిమ యూపీలోని 10 స్థానాల్లో నాలుగింటినే భాజపా గెలుచుకుంది. భాగస్వామ్య పక్షం రెండు గెలిచింది.
  • అవధ్‌లోని 20 సీట్లలో 9 చోట్లే భాజపా విజయం సాధించింది. లఖ్‌నవూలో రాజ్‌నాథ్‌ సింగ్‌ మెజారిటీ 3.47 లక్షల నుంచి 1.5 లక్షలకు తగ్గిపోయింది. 
  • రోహిల్‌ఖండ్‌లోని 11 సీట్లలో నాలుగింటిలోనే భాజపా విజయం సాధించింది. ఖేరీలో పోటీ చేసిన కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్ర పరాజయం పాలయ్యారు. ఆయన కుమారుడు రైతుల ర్యాలీపైకి వాహనంతో దూసుకెళ్లి పలువురి మృతికి కారణమైన సంగతి తెలిసిందే.
  • 2019లో బుందేల్‌ఖండ్‌లోని మొత్తం 5 సీట్లను గెలుచుకున్న భాజపా ఈసారి ఒక సీటుకే పరిమితమైంది.
  • పూర్వాంచల్‌లో గత ఎన్నికల్లో 18 చోట్ల గెలవగా ఈసారి 10 చోట్లే విజయం సాధించింది. సమాజ్‌వాదీ 14 చోట్ల గెలిచింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ మెజారిటీ 4.79 లక్షల నుంచి 1.52 లక్షలకు పడిపోవడం గమనార్హం. రామ మందిరం నిర్మించిన అయోధ్య ఉన్న ఫైజాబాద్‌లో భాజపా ఓడిపోవడం మరింత ఇబ్బందికరం. 
  • బ్రాజ్‌ ప్రాంతంలో భాజపా 5 చోట్ల గెలిచింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని