కొత్తవారు 280 మంది

లోక్‌సభకు ఈసారి 280 మంది తొలిసారిగా ఎన్నికయ్యారు. వారిలో మాజీ ముఖ్యమంత్రులు, సినీ నటులు, రాజకీయ కార్యకర్తలు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఉన్నారు.

Published : 06 Jun 2024 04:27 IST

దిల్లీ: లోక్‌సభకు ఈసారి 280 మంది తొలిసారిగా ఎన్నికయ్యారు. వారిలో మాజీ ముఖ్యమంత్రులు, సినీ నటులు, రాజకీయ కార్యకర్తలు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఉన్నారు.

  • ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి 45 మంది తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెడుతున్నవారే. వారిలో టీవీ రాముడు అరుణ్‌ గోవిల్, కాంగ్రెస్‌ నేత కిశోరీలాల్‌ శర్మ, దళిత హక్కుల ఉద్యమకారుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఉన్నారు.
  • మహారాష్ట్ర నుంచి 33 మంది కొత్తవారే. వారిలో ఉపాధ్యాయుడు భాస్కర్‌ భాగ్రే, కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఉన్నారు.
  • మాజీ ముఖ్యమంత్రుల్లో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నారాయణ్‌ రాణె, త్రివేంద్రసింగ్‌ రావత్, మనోహర్‌లాల్‌ ఖట్టర్, బిప్లబ్‌ కుమార్‌ దేబ్, జితన్‌ రామ్‌ మాంఝీ, బొమ్మై, జగదీశ్‌ షెట్టార్, చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ ఉన్నారు.
  • తొలిసారిగా లోక్‌సభకు వస్తున్న సినీ నటుల్లో సురేశ్‌ గోపి, కంగనా రనౌత్‌ ఉన్నారు.
  • రాజ్యసభ సభ్యుల్లో అనిల్‌దేశాయ్, భూపేంద్ర యాదవ్, ధర్మేంద్రప్రధాన్,  మాండవీయ, పురుషోత్తం రూపాలా లోక్‌సభకు వస్తున్నారు.
  • రాజ కుటుంబాలకు చెందిన ఛత్రపతి సాహు, యదువీర్‌ కృష్ణదత్త చామరాజ వడియార్, కృతీ దేవితోపాటు కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అభిజిత్‌ గంగోపాధ్యాయ తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెడుతున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని