మోదీకి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పిది: కాంగ్రెస్‌

లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. ఇప్పుడు ఆ తీర్పును భగ్నం చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

Published : 06 Jun 2024 04:29 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. ఇప్పుడు ఆ తీర్పును భగ్నం చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 1962 తర్వాత వరుసగా మూడు సార్లు ఎన్నికైన ప్రభుత్వం తమదేనని మోదీ చెప్పుకోవడాన్ని తప్పుపట్టారు. ‘‘నెహ్రుకు 1952లో 364, 1957లో 371, 1962లో 361 స్థానాలు వచ్చాయి. మోదీకి 2024లో 240 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇది ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పు. దాన్ని భగ్నం చేసేందుకు చూస్తున్నారు’’ అని ‘ఎక్స్‌’ వేదికగా విమర్శించారు. మోదీ, అమిత్‌ షాలను ప్రాంతీయ పార్టీలు నమ్మొద్దని అన్నారు. ఆ ఇద్దరిని విశ్వసిస్తే వైకాపా, బిజద పార్టీలకు పట్టిన గతే పడుతుందని చెప్పారు. గత పదేళ్లలో ఆ రెండు పార్టీలు పార్లమెంటులో భాజపాకు బీ-టీంల్లా వ్యవహరించాయని, ఇప్పుడు నైతికంగా, రాజకీయంగా అవమానకరమైన ఓటములు ఎదుర్కొన్నాయని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని