లోక్‌సభకు ఎన్నికైన 74 మంది మహిళలు

తాజా లోక్‌సభ ఎన్నికల్లో 74 మంది మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. అత్యధికంగా పశ్చిమబెంగాల్‌ నుంచి 11 మంది నారీమణులు విజయం సాధించారు. మొత్తం ఎన్నికల బరిలో 797 మంది నిలబడ్డారు.

Published : 06 Jun 2024 05:50 IST

అత్యధికంగా భాజపా నుంచి 30 మంది 
14 మంది ఎంపీలతో రెండోస్థానంలో కాంగ్రెస్‌ 

దిల్లీ: తాజా లోక్‌సభ ఎన్నికల్లో 74 మంది మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. అత్యధికంగా పశ్చిమబెంగాల్‌ నుంచి 11 మంది నారీమణులు విజయం సాధించారు. మొత్తం ఎన్నికల బరిలో 797 మంది నిలబడ్డారు. మిగిలిన పార్టీలన్నింటి కంటే ఎక్కువగా భాజపా 69 మంది మహిళలకు అవకాశమివ్వగా, కాంగ్రెస్‌ 41 మందికి టికెట్లిచ్చింది. ఎన్నికల కమిషన్‌ సమాచారం మేరకు భాజపా తరఫున 30 మంది, కాంగ్రెస్‌ నుంచి 14, టీఎంసీ అభ్యర్థులు 11, ఎస్పీ తరఫున 4, డీఎంకే నుంచి 3, జేడీయూ, ఎల్జేపీ(ఆర్‌)ల నుంచి ఇద్దరేసి చొప్పున గెలుపొందారు.

హేమా మాలిని (భాజపా), మహువా మొయిత్రా (టీఎంసీ), సుప్రియా సూలే (ఎన్సీపీ-ఎస్పీ), డింపుల్‌ యాదవ్‌ (ఎస్పీ) తమ స్థానాలను తిరిగి దక్కించుకోగా, కంగనా రనౌత్‌ (భాజపా), మీసా భారతి (ఆర్జేడీ), ప్రియా సరోజ్‌ (ఎస్పీ), ఇక్రా చౌదరి (ఎస్పీ) తొలి ప్రయత్నంలోనే ఎంపీలుగా గెలిచారు. 

2019లో మహిళా ఎంపీల సంఖ్య 78 కావడం గమనార్హం. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ కల్పించాలన్న బిల్లును పార్లమెంటు ఆమోదించిన తరవాత జరిగిన మొదటి లోక్‌సభ, శాసనసభ ఎన్నికలివి. కోటా బిల్లు చట్ట రూపం దాల్చినా అది ఇంకా అమల్లోకి రాలేదన్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని