సీఎం రేవంత్‌రెడ్డికి విజేతలు, పీసీసీ కార్యవర్గం కృతజ్ఞతలు

లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గిన భువనగిరి, వరంగల్, జహీరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కడియం కావ్య, సురేశ్‌ షెట్కార్‌లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బుధవారం ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Published : 06 Jun 2024 05:50 IST

సీఎంకు అభినందనలు తెలుపుతున్న పీసీసీ నేతలు అనిల్‌కుమార్‌యాదవ్, రోహిన్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, వేణుగోపాల్, మల్లురవి  

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గిన భువనగిరి, వరంగల్, జహీరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కడియం కావ్య, సురేశ్‌ షెట్కార్‌లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బుధవారం ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతగా పని చేసి కేంద్రం నుంచి రాష్ట్రాభివృద్ధికి నిధులు సాధించాలని సీఎం సూచించారు. వారి వెంట ఆయా పార్లమెంటు స్థానాలకు చెందిన మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బీర్ల ఐలయ్య, మల్‌రెడ్డి రంగారెడ్డి, వేముల వీరేశం, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మందుల సామెల్, కడియం శ్రీహరి, జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అలాగే సీఎంను పీసీసీ కార్యవర్గం సన్మానించింది. గతంలో మూడు పార్లమెంటు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్‌ పార్టీ మీ సారథ్యంలో 8 స్థానాలకు చేరుకుందని ఆయన్ను కొనియాడారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్, ఎంపీ మల్లురవి, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి, ఫహీం ఖురేషీ, ఈరవత్రి అనిల్‌ తదితరులు పాల్గొన్నారు. 

రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందిస్తున్న కడియం శ్రీహరి, కావ్య 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని