గంగా డెల్టాలో తృణమూల్‌ ఆధిపత్యం

పశ్చిమ బెంగాల్‌లోని గంగా పరీవాహక ప్రాంతంతోపాటు జంగల్‌ మహల్, ఉత్తర బెంగాల్‌లలో తృణమూల్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ఈ ప్రాంతాల్లోని 29 లోక్‌సభ నియోజకవర్గాల్లో 18 గెలుచుకుని చరిత్ర సృష్టించింది.

Published : 06 Jun 2024 05:18 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని గంగా పరీవాహక ప్రాంతంతోపాటు జంగల్‌ మహల్, ఉత్తర బెంగాల్‌లలో తృణమూల్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ఈ ప్రాంతాల్లోని 29 లోక్‌సభ నియోజకవర్గాల్లో 18 గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఉత్తర బెంగాల్‌లోని కొంత ప్రాంతంతోపాటు మతువా, దక్షిణ బెంగాల్‌లలో భాజపా సత్తా చాటింది. లోక్‌సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ మొత్తం 42లో 29 స్థానాలను గెలుచుకుని పట్టు నిరూపించుకున్న సంగతి తెలిసిందే. 

  • గంగా డెల్టాలోని ఉత్తర, దక్షిణ పరగణాలు, కోల్‌కతా, హుగ్లీ, హావ్‌డా జిల్లాల్లోని 16 సీట్లలో 14 చోట్ల తృణమూల్‌ విజయం సాధించింది.
  • బసీర్‌హట్‌లో భాజపా తరఫున పోటీ చేసిన సందేశ్‌ఖాలీ బాధితురాలు రేఖా పాత్ర ఓడిపోయారు. ఈ ప్రాంతంలో దాని ప్రభావం కనిపించలేదు. 
  • అటవీ ప్రాంతమైన జంగల్‌ మహల్‌లోని పశ్చిమ జిల్లాల్లో తృణమూల్, భాజపా సమాన విజయాలను సాధించాయి. ఈ ప్రాంతంలోని బంకూరా సీట్‌లో కేంద్ర మంత్రి సుభాశ్‌ సర్కార్‌ ఓడిపోయారు. 
  • ఉత్తర బెంగాల్‌లోని 8 సీట్లలో ఆరింటిని భాజపా కైవసం చేసుకుంది.
  • దక్షిణ బెంగాల్‌లో ముస్లింల ప్రాబల్యమున్న ప్రాంతాల్లో తృణమూల్‌ భారీ విజయాలను నమోదు చేసింది.
  • మైనారిటీ ఓట్లలో డివిజన్‌ తేవడంద్వారా ఉత్తర బెంగాల్‌లో భాజపా పట్టు సాధించింది.

యూపీలో 8 చోట్ల అసెంబ్లీ ఉప ఎన్నికలు!

లఖ్‌నవూ: ఉత్తర్‌ ప్రదేశ్‌లో 8 మంది ఎమ్మెల్యేలు లోక్‌సభకు ఎన్నిక కావడంతో వారి స్థానాల్లో ఉప ఎన్నికలు తప్పేలా లేవు. రాజకీయంగా అత్యంత కీలకమైన ఈ రాష్ట్రంలో 13 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు పోటీ చేశారు. వారిలో 8 మంది విజయం సాధించారు. 

  • గెలిచిన ఎమ్మెల్సీల్లో మంత్రిగా ఉన్న జితిన్‌ ప్రసాద ఉన్నారు. ఆయన పీలీభీత్‌ నుంచి గెలిచారు. హాథరాస్‌ నుంచి మరో మంత్రి అనూప్‌ ప్రధాన్‌ విజయం సాధించారు. 
  • పరాజయం పాలైన రాష్ట్ర మంత్రుల్లో దినేశ్‌ ప్రతాప్‌ సింగ్‌ ఉన్నారు. ఆయన రాయ్‌బరేలీలో రాహుల్‌ గాంధీ చేతిలో ఓటమి పాలయ్యారు. డింపుల్‌ యాదవ్‌ చేతిలో మరో మంత్రి జయ్‌వీర్‌ సింగ్‌ ఓడిపోయారు.
  • ఈ ఎన్నికల్లో గెలిచిన సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని