కర్ణాటక మంత్రి నాగేంద్ర రాజీనామా

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, యువజన క్రీడా శాఖల మంత్రి నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశారు.

Published : 07 Jun 2024 05:11 IST

ఈనాడు, బెంగళూరు: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, యువజన క్రీడా శాఖల మంత్రి నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గురువారం రాత్రి  సీఎం సిద్ధరామయ్యకు అందజేశారు. ఇటీవల వాల్మీకి అభివృద్ధి మండలి అధికారి చంద్రశేఖర్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన రాసిన సూసైడ్‌ నోట్‌లో మంత్రి ఆదేశంతోనే నగదు అక్రమ బదిలీకి అధికారులు తనపై ఒత్తిడి చేసినట్లు ప్రస్తావించారు. విచారణకు సహకరించేందుకు.. ప్రభుత్వంపై మచ్చ పడకూడదనే  స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లుగా మంత్రి నాగేంద్ర ప్రకటించారు. అధిష్ఠానంతో చర్చించి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని