అరకు లోక్‌సభ స్థానానికి 50వేల ‘నోటా’ ఓట్లు

సార్వత్రిక ఎన్నికల్లో మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో రాష్ట్రంలోని అరకు లోక్‌సభ స్థానంలో ఏకంగా 50,470 ‘నోటా’ (పై వారెవరూ కాదు) ఓట్లు పోలయ్యాయి.

Published : 07 Jun 2024 05:12 IST

దేశంలోనే రెండో అత్యధికం

ఈనాడు డిజిటల్, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో రాష్ట్రంలోని అరకు లోక్‌సభ స్థానంలో ఏకంగా 50,470 ‘నోటా’ (పై వారెవరూ కాదు) ఓట్లు పోలయ్యాయి. ఇవి పోలైన ఓట్లలో 4.33శాతం. నోటాకు అత్యధికంగా పోలైన ఓట్లలో దేశంలోనే ఇది రెండో అత్యధికం.  మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ లోక్‌సభ స్థానం 2,18,674 నోటా ఓట్లతో మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో పోలైన నోటా ఓట్లను పరిశీలిస్తే..రెండు, మూడు స్థానాల్లో అనకాపల్లి (26,235), శ్రీకాకుళం (24,605) లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అత్యల్పంగా విశాఖపట్నం లోక్‌సభ స్థానానికి 5,313 నోటా ఓట్లు పోలయ్యాయి. 

  • రాష్ట్రంలో అత్యల్పంగా నోటా ఓట్లు పోలైన మొదటి అయిదు అసెంబ్లీ స్థానాలు.. విశాఖ దక్షిణం (631), కర్నూలు (718), జగ్గయ్యపేట (773), చిలకలూరిపేట (788), మంగళగిరి (890) ఉన్నాయి. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని