వైకాపా కేంద్ర కార్యాలయం మూసివేత

తాడేపల్లిలో ఉన్న వైకాపా కేంద్ర కార్యాలయాన్ని మూసివేయనున్నారు. ఈ నెల 10 నుంచి తాడేపల్లిలోని ఆ పార్టీ అధినేత జగన్‌ క్యాంపు కార్యాలయం నుంచే పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తారు.

Published : 07 Jun 2024 05:13 IST

తాడేపల్లి క్యాంపు ఆఫీస్‌ నుంచే కార్యకలాపాలు

ఈనాడు, అమరావతి: తాడేపల్లిలో ఉన్న వైకాపా కేంద్ర కార్యాలయాన్ని మూసివేయనున్నారు. ఈ నెల 10 నుంచి తాడేపల్లిలోని ఆ పార్టీ అధినేత జగన్‌ క్యాంపు కార్యాలయం నుంచే పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తారు. ప్రస్తుతం ప్రైవేటు భవనంలో కొనసాగుతున్న కేంద్ర కార్యాలయం అద్దె నెలకు సుమారు రూ.4 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనే ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని