తితిదే ఈవో ధర్మారెడ్డి పాస్‌పోర్ట్‌ సీజ్‌ చేయాలి

బాధ్యతలను మరొకరికి అప్పగించకుండానే సెలవుపై విదేశాలకు వెళ్లేందుకు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి యత్నిస్తున్నారని జనసేన నాయకులు ఆరోపించారు.

Published : 07 Jun 2024 05:19 IST

నిధులు మాయమైనట్లు ఆరోపణలున్నాయి
సీఐడీకి జనసేన ఫిర్యాదు

సీఐడీ ఎస్సై పాపయ్యకు ఫిర్యాదు పత్రం అందజేస్తున్న జనసేన నాయకులు

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: బాధ్యతలను మరొకరికి అప్పగించకుండానే సెలవుపై విదేశాలకు వెళ్లేందుకు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి యత్నిస్తున్నారని జనసేన నాయకులు ఆరోపించారు. ఆయన పాస్‌పోర్టు సీజ్‌ చేసి లుక్‌అవుట్‌ నోటీసులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తిరుపతిలోని ప్రాంతీయ సీఐడీ కార్యాలయంలో ఎస్సై పాపయ్యకు గురువారం ఫిర్యాదు చేశారు. అనంతరం తిరుపతి జనసేన ఇన్‌ఛార్జి కిరణ్‌ రాయల్‌ మాట్లాడుతూ శ్రీవారి బంగారు ఆభరణాలు, వజ్రాలు మాయమైనట్లు ఆరోపణలు ఉన్నాయని.. శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి అనేక కుంభకోణాలు వెలుగులోకి రావాల్సి ఉందని పేర్కొన్నారు. శ్రీవారి భక్తులు సమర్పించిన కానుకలకు సరైన లెక్కలు లేవని ఆరోపించారు. పాలక మండలి మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డితో కలసి ధర్మారెడ్డి చెన్నైలో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారని పేర్కొన్నారు. తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి రాజకీయ ప్రయోజనాలకు, ఆయన స్వప్రయోజనాలకు పెద్దఎత్తున నిధులు కేటాయించారని మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు