షర్మిల తీరుతో పార్టీకి నష్టం

‘ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఒంటెత్తు పోకడలతో పార్టీని నాశనం చేశారు. నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగింది.

Published : 07 Jun 2024 05:20 IST

ఆమె రాజీనామా చేయాలి: పీసీసీ నేతలు

విజయవాడ (గవర్నర్‌పేట), న్యూస్‌టుడే: ‘ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఒంటెత్తు పోకడలతో పార్టీని నాశనం చేశారు. నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగింది. అధిష్ఠానం ఎన్నికల నిధులు పంపిస్తే, దాన్ని అభ్యర్థులకు ఇవ్వకుండా దాచుకున్నారు. పార్టీకి, అభ్యర్థులకు నమ్మకద్రోహం చేసిన షర్మిల.. తక్షణం పదవికి రాజీనామా చేయాల’ని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, రాకేశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. విజయవాడ ఆంధ్రరత్నభవన్‌లో గురువారం కాంగ్రెస్‌ తరఫున పోటీచేసిన అభ్యర్థులు సమావేశమయ్యారు. పద్మశ్రీ మాట్లాడుతూ... కష్టకాలంలో జెండా మోసిన వారికి సీట్లు ఇవ్వకుండా షర్మిల రోడ్డున పడేశారని విమర్శించారు. వైఎస్సార్‌ కడుపున పుట్టిన జగన్, షర్మిల ఇద్దరూ కాంగ్రెస్‌ పార్టీకి ద్రోహం చేశారంటూ పద్మశ్రీ కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ కూడా ఏకపక్షంగా వ్యవహరించారని, రాహుల్‌ గాంధీ వచ్చినరోజు మాత్రమే ఏపీకి వచ్చారని రాకేశ్‌రెడ్డి మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని