యూపీ ప్రజలు దేశానికి బలమైన సందేశం ఇచ్చారు : ప్రియాంకా గాంధీ

ఉత్తర్‌ప్రదేశ్‌లో విపక్ష ‘ఇండియా’ కూటమిని ముందుండి నడిపి.. మెజారిటీ సీట్లు సాధించడంలో కీలకంగా వ్యవహరించిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌కు కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా గాంధీ ధన్యవాదాలు తెలిపారు.

Published : 07 Jun 2024 05:23 IST

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో విపక్ష ‘ఇండియా’ కూటమిని ముందుండి నడిపి.. మెజారిటీ సీట్లు సాధించడంలో కీలకంగా వ్యవహరించిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌కు కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా గాంధీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. తాజా ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ‘ఇండియా’ కూటమి 43 స్థానాలు దక్కించుకోగా.. భాజపా 36కే పరిమితమైంది. కూటమి పక్షాల్లో ఎస్పీ 37 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇవే భాజపాకు పోటీగా ప్రతిపక్షాలూ గౌరవప్రదమైన స్థానాలు సాధించడంలో కీలకంగా మారాయి. దాంతో అఖిలేశ్‌ యాదవ్, ఆయన సతీమణి డింపుల్, ఎంపీ రామ్‌గోపాల్‌ యాదవ్‌తోపాటు ప్రజా సమస్యలపై కలసికట్టుగా పోరాడిన రెండు పార్టీల నాయకులు, శ్రేణులకు ఆమె అభినందనలు తెలిపారు. అధికార భాజపా ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు బనాయించినా, అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా.. అక్రమ అరెస్టులు చేసినా.. వెన్నుచూపకుండా పోరాడి.. దేశ ప్రజలకు బలమైన సందేశం పంపించారని కొనియాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని