త్వరలోనే భాజపాకు వైకాపా సరెండర్‌

దిల్లీ మద్యం కుంభకోణంలో జగన్‌ సతీమణి భారతికి కూడా హస్తం ఉందని జమ్మలమడుగు నుంచి భాజపా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదినారాయణరెడ్డి ఆరోపించారు.

Updated : 07 Jun 2024 05:27 IST

దిల్లీ మద్యం కుంభకోణంలో భారతి ప్రమేయం
భాజపా నేత ఆదినారాయణరెడ్డి ఆరోపణ 

ఈనాడు, అమరావతి: దిల్లీ మద్యం కుంభకోణంలో జగన్‌ సతీమణి భారతికి కూడా హస్తం ఉందని జమ్మలమడుగు నుంచి భాజపా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. ఆ విషయంపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన వైకాపా ఎమ్మెల్యేలు వారం రోజుల్లోనే జంప్‌ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. పులివెందులలోనూ వైకాపా నామరూపాలు లేకుండా పోతుందని, జగన్‌ అతి త్వరలోనే వైకాపాను భాజపాకు సరెండర్‌ చేస్తారని అన్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య విషయంలో.. కొత్తగా ఎంపీగా ఎన్నికైన అవినాష్‌రెడ్డిపై తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పారు. 

  • విశాఖ నార్త్, ఆదోని అసెంబ్లీ స్థానాల నుంచి గెలిచిన విష్ణుకుమార్‌రాజు, పార్థసారథిలు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సీనియర్‌ నేతలను గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని