‘స్థానిక ఎన్నికల్లోనూ భాజపాదే గెలుపు’

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ భాజపాదే గెలుపని భాజపా నేత, చేవెళ్ల ఎంపీగా ఎన్నికైన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.

Published : 07 Jun 2024 05:26 IST

ఈనాడు, హైదరాబాద్‌: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ భాజపాదే గెలుపని భాజపా నేత, చేవెళ్ల ఎంపీగా ఎన్నికైన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల్లో గెలుపునకు అవసరమైన నాయకత్వాన్ని సిద్ధం చేశామన్నారు. గురువారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందని, కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో రాష్ట్రాభివృద్ధి కొనసాగుతుందన్నారు. 

ప్రజాసమస్యలపై దృష్టి సారించాలి: ప్రభాకర్‌

రాష్ట్రంలో పాలన, ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టిసారించాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌.వి.ఎస్‌.ఎస్‌.ప్రభాకర్‌ సూచించారు. రైతులు కల్తీ విత్తనాలతో, కరెంటు కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కారించాలని డిమాండ్‌ చేశారు. గురువారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభాకర్‌ మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని