సీఎంను కలిసిన కొత్త ఎంపీలు వంశీకృష్ణ, బలరాం నాయక్‌

లోక్‌సభకు పెద్దపల్లి నుంచి కొత్తగా ఎన్నికైన గడ్డం వంశీకృష్ణ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 07 Jun 2024 05:34 IST

సీఎం రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందిస్తున్న గడ్డం వంశీకృష్ణ. చిత్రంలో ఎమ్మెల్యే వివేక్‌ దంపతులు, మంత్రి పొంగులేటి

హైదరాబాద్, న్యూస్‌టుడే: లోక్‌సభకు పెద్దపల్లి నుంచి కొత్తగా ఎన్నికైన గడ్డం వంశీకృష్ణ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వంశీకృష్ణ వెంట ఆయన తల్లిదండ్రులు, ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకటస్వామి, సరోజిని కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సీఎంకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. టికెట్‌ ఇచ్చి గెలుపునకు కృషి చేసినందుకు రేవంత్‌రెడ్డికి వంశీకృష్ణ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. చిన్న వయసులోనే లోక్‌సభకు ఎన్నికైన వంశీకృష్ణను సీఎం అభినందించారు. పార్లమెంటులో స్థానిక, రాష్ట్ర సమస్యలపై గళమెత్తాలని, చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. 


సీఎంను కలిసిన బలరాం నాయక్‌..

ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందిస్తున్న బలరాం నాయక్‌. చిత్రంలో మంత్రి సీతక్క,
ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, విప్‌ రామచంద్రు నాయక్, కోరం కనకయ్య,
మురళీ నాయక్, తెల్లం వెంకట్రావ్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి

మహబూబాబాద్‌ ఎంపీగా ఎన్నికైన బలరాం నాయక్‌ కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎంకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. సీఎంను కలిసిన వారిలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మంత్రి సీతక్క, విప్‌ డా.రామచంద్రు నాయక్, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, మురళీ నాయక్, తెల్లం వెంకట్రావ్‌ తదితరులున్నారు. బలరాం నాయక్‌ జన్మదినం సందర్భంగాను, విజయం సాధించినందుకు ఆయనకు రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గాలవారీగా వచ్చిన ఓట్లపై సమీక్షించి ఎమ్మెల్యేలను సీఎం అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు