దళితుడిని భారాస అధ్యక్షుడిగా నియమించాలి

దళితుడిని భారాస అధ్యక్షుడిగా నియమించి సామాజిక న్యాయం చేయాలని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కేసీఆర్‌కు సూచించారు.

Published : 07 Jun 2024 05:34 IST

- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్, న్యూస్‌టుడే: దళితుడిని భారాస అధ్యక్షుడిగా నియమించి సామాజిక న్యాయం చేయాలని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కేసీఆర్‌కు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసిన వై.ఎస్‌.జగన్‌కు ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ఆయన గురువారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహబూబ్‌నగర్‌ ఎంపీ సీటు ఓడిపోతే కొందరు సీఎం సొంత జిల్లాలో ఓడిపోయారని వ్యాఖ్యానిస్తున్నారని ఆక్షేపించారు. ‘ముఖ్యమంత్రికి సొంత జిల్లా అంటూ ఉండదు. రాష్ట్రమంతా ఆయనదే’నన్నారు. తన కుమార్తె బెయిల్‌ కోసం మాజీ సీఎం కేసీఆర్‌ భాజపాకు బాసటగా నిలిచి లక్షల మంది భారాస కార్యకర్తలను మోసం చేశారని ఆరోపించారు. అందుకే మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ ఓడిపోయిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్ల శాతం పెరిగిందని తెలిపారు. కేసీఆర్‌ మద్దతుతోనే భాజపాకు అసెంబ్లీ కంటే లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగిందన్నారు. కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు సామాజిక న్యాయం చేయలేదు, ఇప్పటికైనా దళితుడిని భారాస అధ్యక్షుడిగా నియమించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని