రాష్ట్రంలో పౌరస్వేచ్ఛకు భంగం వాటిల్లుతోంది

రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. ‘చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపులతో ప్రజాస్వామ్యానికి పెనుముప్పు వచ్చింది.

Published : 08 Jun 2024 06:29 IST

గవర్నర్‌ కలుగజేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా
‘ఎక్స్‌’లో వైకాపా అధ్యక్షుడు జగన్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. ‘చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపులతో ప్రజాస్వామ్యానికి పెనుముప్పు వచ్చింది. తెదేపా దాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి. యంత్రాంగం మొత్తం నిర్వీర్యమైపోయింది. వైకాపా నాయకులు, కార్యకర్తలు, పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణ లేకుండా పోయింది. విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులపైనా దౌర్జన్యాలకు దిగి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి, పౌరస్వేచ్ఛకు తీవ్రం భంగం వాటిల్లుతోంది. గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను’ అని శుక్రవారం ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

ఈ ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిపోయిన అభ్యర్థులు శుక్రవారం ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌తో భేటీ అయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని