ఇక్కడ కనిపిస్తున్నది పవన్‌ కాదు.. తుపాన్‌

అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎన్డీయేకి చరిత్రాత్మక విజయం చేకూర్చినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎన్డీయే నేతగా తనను ఎన్నుకున్నందున కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు.

Published : 08 Jun 2024 05:44 IST

ఎన్డీయేకు ఏపీ ప్రజలు చరిత్రాత్మక విజయం చేకూర్చారు: ప్రధాని మోదీ

ఈనాడు, దిల్లీ: అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎన్డీయేకి చరిత్రాత్మక విజయం చేకూర్చినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎన్డీయే నేతగా తనను ఎన్నుకున్నందున కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ‘‘ఎన్డీయేకి ప్రజలు చరిత్రాత్మక విజయం చేకూర్చిన విషయం చంద్రబాబు కూడా చెప్పారు. ఇక్కడ కనిపిస్తున్నది పవన్‌ కాదు.. తుపాన్‌. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మాకు భారీ విజయం చేకూర్చారు’’ అని మోదీ అన్నారు. అలాగే తెలంగాణ, కర్ణాటకల్లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘దక్షిణ భారతదేశంలో ఎన్డీయే కొత్త పునాదిరాయి వేసింది. కర్ణాటక, తెలంగాణల్లో ఇటీవలే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అనతికాలంలోనే అక్కడ ప్రజావిశ్వాసాన్ని కోల్పోయాయి. భ్రమల్లోంచి ప్రజలు బయటికొచ్చి ఎన్డీయేని అక్కున చేర్చుకున్నారు’’ అని పేర్కొన్నారు.

ఎన్డీయే నాయకుడిగా మోదీ ఏకగ్రీవంగా ఎన్నికవడంతో రాష్ట్ర భాజాపా కార్యాలయం వద్ద సంబరాలు చేసుకుంటున్న పార్టీ శ్రేణులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని