గవర్నర్‌కు ఆ ఫిర్యాదు హాస్యాస్పదం

వైకాపా వాళ్లపై తెదేపా నాయకులు దాడులు చేస్తున్నారని ఆపద్ధర్మ సీఎం జగన్‌ అనడం, దానిపై వైకాపా వాళ్లు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికైన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.

Published : 08 Jun 2024 05:45 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి 

ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా వాళ్లపై తెదేపా నాయకులు దాడులు చేస్తున్నారని ఆపద్ధర్మ సీఎం జగన్‌ అనడం, దానిపై వైకాపా వాళ్లు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికైన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అరాచకాలు, దాడులకు పాల్పడింది వైకాపా వాళ్లేనని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘జగన్‌ మాట్లాడిన తీరు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ప్రజావేదిక కూల్చడంతో మొదలుపెట్టి.. రాష్ట్రాన్ని ఆయన నాశనం చేశారు. రాష్ట్రాన్ని అరాచకాలకు చిరునామాగా మార్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మేము గవర్నర్‌ దగ్గరకు వెళ్లాల్సిన సమయంలో.. వైకాపా వాళ్లను పంపడం జగన్‌ రివర్స్‌ విధానంలో భాగమే’’ అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని