ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా చేశాం: బొత్స

కొంతమంది ఉపాధ్యాయులు తమ ఆరోగ్య, కుటుంబ ఇతరత్రా ఇబ్బందులతో బదిలీలు కోరుకుంటూ దరఖాస్తు చేయడంతో వాటిని పారదర్శకంగా చేశామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Updated : 08 Jun 2024 06:29 IST

ఈనాడు, అమరావతి: కొంతమంది ఉపాధ్యాయులు తమ ఆరోగ్య, కుటుంబ ఇతరత్రా ఇబ్బందులతో బదిలీలు కోరుకుంటూ దరఖాస్తు చేయడంతో వాటిని పారదర్శకంగా చేశామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ‘ఈనాడు’లో శుక్రవారం ప్రచురితమైన ‘బొత్సకు డబ్బులిచ్చాం.. అయినా బదిలీ కాలేదు!’ వార్తకు ఆయన ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. ‘‘ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఈ బదిలీలు నిలిపివేయాలని అధికారులను కోరాను. కొత్త ప్రభుత్వం తనకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు. బదిలీల కోసం ఎక్కడా లంచాలు తీసుకోలేదు’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని