వైకాపా కవ్వింపు చర్యలపై సంయమనం పాటించండి

ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని తట్టుకోలేక వైకాపా వాళ్లు చేస్తున్న కవ్వింపు చర్యలపై అప్రమత్తంగా ఉండాలని తెదేపా శ్రేణులకు ఆ పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.

Published : 08 Jun 2024 05:47 IST

తెదేపా శ్రేణులకు చంద్రబాబు పిలుపు

ఈనాడు డిజిటల్, అమరావతి: ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని తట్టుకోలేక వైకాపా వాళ్లు చేస్తున్న కవ్వింపు చర్యలపై అప్రమత్తంగా ఉండాలని తెదేపా శ్రేణులకు ఆ పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ విషయంలో శ్రద్ధగా ఉండాలని, దాడులు, ప్రతిదాడులు జరగకుండా చూడాలని ఎన్నికైన ఎమ్మెల్యేలు, నేతల్ని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య నెలకొన్న ఉద్రిక్త, ఘర్షణ ఘటనలపై ఆరా తీశారు. పార్టీ నేతల నుంచి ఆయా ఘటనలకు సంబంధించిన సమాచారం తెప్పించుకున్నారు. వైకాపా కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా సంయమనం పాటించాలన్నారు. శాంతిభద్రతల్ని కాపాడాలని, ఉద్రిక్త పరిస్థితుల్ని నిలువరించాలని పోలీసులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని