వైకాపాకు మాజీ మంత్రి రావెల రాజీనామా

మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గుంటూరులో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘రాజ్యాధికారం వైకాపాతో సాధ్యమని భ్రమించి ఆ పార్టీలో చేరా.

Published : 08 Jun 2024 05:52 IST

గుంటూరు (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గుంటూరులో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘రాజ్యాధికారం వైకాపాతో సాధ్యమని భ్రమించి ఆ పార్టీలో చేరా. ఆ పార్టీని రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలు కూటమికి చరిత్రాత్మక విజయం ఇచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమం చివరి దశకు వచ్చింది. సమస్య పరిష్కారానికి కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబుల నాయకత్వం ఎంతో అవసరమని భావిస్తున్నా’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు