విద్యుత్‌ సంస్థల్లో అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలి

విద్యుత్‌ సంస్థల్లో చోటుచేసుకున్న రూ.వేల కోట్ల అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ డిమాండు చేశారు. ఒప్పందం కంటే అధిక బిల్లులు చెల్లించి జగన్‌ అస్మదీయ కంపెనీలకు రూ.వేల కోట్లు దోచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 08 Jun 2024 05:53 IST

భాజపా నేత లంకా దినకర్‌ 

ఈనాడు డిజిటల్, అమరావతి: విద్యుత్‌ సంస్థల్లో చోటుచేసుకున్న రూ.వేల కోట్ల అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ డిమాండు చేశారు. ఒప్పందం కంటే అధిక బిల్లులు చెల్లించి జగన్‌ అస్మదీయ కంపెనీలకు రూ.వేల కోట్లు దోచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని భాజపా కార్యాలయంలో దినకర్‌ శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. ‘ఎలక్ట్రికల్‌ మీటర్లకు సంబంధించిన సామగ్రికి సరఫరా సమయంలోనే 80 శాతం బిల్లులు చెల్లించడం వెనక అవినీతి దాగి ఉంది. రాబోయే మూడు సంవత్సరాలకు సరిపడా సామగ్రిని ముందే తీసుకుని, బిల్లులు చెల్లించడం విస్మయానికి గురిచేస్తోంది. 63 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లను తెలంగాణలో రూ.1.20 లక్షలు చొప్పున పెట్టి తీసుకుంటే, ఏపీ ప్రభుత్వం మాత్రం ఒక్కోదానికి రూ.2.69 లక్షలు చెల్లించింది. అల్యూమినియం కండక్టర్లను తెలంగాణతో పోల్చితే రెట్టింపు ధరకు తీసుకుంది. విద్యుత్‌ పంపిణీ సంస్థల పునర్వవ్యస్థీకరణ పథకం (ఆర్డీఎస్‌ఎస్‌) సూచించిన రూ.11 వేల కోట్ల పనులకు 29 శాతం అధికంగా చెల్లించింది. వీటన్నింటిపై కొత్త ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలి’ అని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు