రాహుల్‌ ఏ సీటుకు రాజీనామా చేస్తారో 18లోగా స్పీకర్‌కు తెలపాలి: నిపుణులు

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు నియోజక వర్గాల నుంచీ గెలుపొందిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఏ స్థానానికి రాజీనామా చేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.

Published : 08 Jun 2024 06:23 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు నియోజక వర్గాల నుంచీ గెలుపొందిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఏ స్థానానికి రాజీనామా చేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రెండు వారాల్లోగా ఆయన దీనిపై నిర్ణయం తీసుకుని తన రాజీనామా లేఖను లోక్‌సభ సభాపతికి పంపించాల్సి ఉంటుందని నిపుణులు తెలిపారు. ఆ గడువులోగా లేఖను పంపించకపోతే ప్రస్తుతం ఎన్నికైన వయనాడ్‌ (కేరళ), రాయ్‌బరేలీ (ఉత్తర్‌ప్రదేశ్‌) స్థానాలు రెండింటికీ ఆయన అనర్హులయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కేంద్ర మంత్రి మండలి సిఫార్సుతో ఈనెల 5న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 17వ లోక్‌సభను రద్దు చేసినప్పటికీ 18వ లోక్‌సభకు ప్రొటెం స్పీకర్‌ నియమితులయ్యే వరకు ప్రస్తుత స్పీకర్‌ ఓం బిర్లా కొనసాగుతారు. ఏ సీటుకు తాను రాజీనామా చేస్తున్నారో తెలుపుతూ ఈ నెల 18వ తేదీ లోగా రాహుల్‌ లేఖ రాయాల్సి ఉంటుంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని