ఇలాంటి సంఘటనలు మీకూ ఎదురుకావొచ్చు

చండీగఢ్‌ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ కుల్వీందర్‌ కౌర్‌ తనపై దాడి చేసిన ఘటనపై బాలీవుడ్‌ నటులు స్పందించకపోవడంపై నటి, ఎంపీ కంగనా రనౌత్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 08 Jun 2024 06:24 IST

బాలీవుడ్‌ స్పందించకపోవడంపై కంగన ఆవేదన

ముంబయి: చండీగఢ్‌ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ కుల్వీందర్‌ కౌర్‌ తనపై దాడి చేసిన ఘటనపై బాలీవుడ్‌ నటులు స్పందించకపోవడంపై నటి, ఎంపీ కంగనా రనౌత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఇన్‌స్టా వేదికగా స్పందించిన ఆమె..‘‘నామీద ఎయిర్‌పోర్టులో జరిగిన ఘటనపై మీరు మౌనంగా ఉండొచ్చు లేక వేడుక చేసుకుంటూ ఉండొచ్చు. భవిష్యత్తులో మీరు మనదేశంలో అయినా, విదేశాల్లో అయినా అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే.. ఇజ్రాయెల్‌ లేక పాలస్తీనాకు చెందినవారు మీపై లేక మీ పిల్లలపై దాడికి పాల్పడొచ్చు. అప్పుడు మీ వాక్‌స్వాతంత్య్రం హక్కుల కోసం నేను పోరాడుతున్నానని గుర్తిస్తారు’’ అని వ్యాఖ్యానించారు. తర్వాత ఆ పోస్టును డిలీట్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు