విపక్షనేతగా రాహుల్‌కే నా ఓటు

లోక్‌సభ ఎన్నికల్లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ నిలిచారని, దిగువసభ విపక్షనేత పదవిని ఆయన చేపట్టడమే సబబు అని పార్టీ సీనియర్‌ నేత శశిథరూర్‌ పేర్కొన్నారు.

Published : 08 Jun 2024 06:25 IST

ఆయనే మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌
ఇకపై నేను లోక్‌సభకు పోటీచేయను: థరూర్‌

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ నిలిచారని, దిగువసభ విపక్షనేత పదవిని ఆయన చేపట్టడమే సబబు అని పార్టీ సీనియర్‌ నేత శశిథరూర్‌ పేర్కొన్నారు. ఎన్నికల్లో రాహుల్, పార్టీ అధ్యక్షుడు ఖర్గే దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారని, ఖర్గే ఇప్పటికే రాజ్యసభలో విపక్షనేత కావడంతో లోక్‌సభలో ఆ హోదాకు రాహులే సమర్థుడని చెప్పారు. దురహంకారం, తాము చేసిందే సరైనదనే వాదంతో వ్యవహరిస్తున్న భాజపాకు భారతీయ ఓటరు తగిన సందేశాన్ని ఇచ్చాడని చెప్పారు. వరసగా నాలుగోసారి లోక్‌సభకు ఎన్నికైన ఆయన పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వాన్ని నడపడంలో ఎవరినీ సంప్రదించడం అలవాటేలేని ప్రధాని మోదీ, అమిత్‌ షాలకు ఇప్పుడు సవాలే. ఇప్పటికే అగ్నివీర్‌ పథకంపై ఒక పార్టీ ప్రశ్నలు లేవనెత్తింది. ఏపీ, బిహార్‌లు ప్రత్యేక హోదా కోసం డిమాండ్లు చేస్తున్నాయి. ఇలాంటివాటిపై ఇప్పుడు ప్రభుత్వం పునరాలోచన చేయాల్సి ఉంటుంది. 230 మంది ఎంపీలతో విపక్షం బలంగా ఉన్నందువల్ల మునుపటి మాదిరిగా పార్లమెంటును రబ్బరుస్టాంపుగా, ఓ నోటీసుబోర్డుగా చూస్తామంటే కుదరదు. నిర్ణయాలు ఏకపక్షంగా, ఆకస్మికంగా తీసుకునే వీలుండదు’’ అని థరూర్‌ చెప్పారు. యువరక్తం రావడానికి వీలుగా ఎప్పుడు వైదొలగాలనేది ప్రతిఒక్కరికీ తెలియాలని, ఆ ప్రకారం లోక్‌సభ బరిలో ఇకపై తాను ఉండనని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని