వయనాడ్‌/రాయ్‌బరేలీపై 17లోగా నిర్ణయం

ఇటీవలి ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ వయనాడ్‌ (కేరళ)తో పాటు తమ కుటుంబ కంచుకోట రాయ్‌బరేలీ (యూపీ)లోనూ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Updated : 09 Jun 2024 07:16 IST

దిల్లీ: ఇటీవలి ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ వయనాడ్‌ (కేరళ)తో పాటు తమ కుటుంబ కంచుకోట రాయ్‌బరేలీ (యూపీ)లోనూ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రెండింటిలో ఏ స్థానాన్ని వదులుకుంటారనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ నెల 17లోగా నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వేణుగోపాల్‌ తెలిపారు. 


మోదీ ప్రమాణ స్వీకారానికి రండి.. కేసీఆర్‌కు ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా భారాస అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. కేంద్ర మాజీ మంత్రి ప్రహ్లాద్‌ జోషి శనివారం కేసీఆర్‌కు ఫోన్‌ చేసి ఆహ్వానించారని ఈ మేరకు భారాస వర్గాలు శనివారం తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని