ఎస్పీ పార్లమెంటరీ పార్టీ నేతగా అఖిలేశ్‌ యాదవ్‌!

లోక్‌సభలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తరఫున పార్లమెంటరీ పార్టీ నేతగా మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ వ్యవహరించనున్నారు.

Published : 09 Jun 2024 04:58 IST

లఖ్‌నవూ: లోక్‌సభలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తరఫున పార్లమెంటరీ పార్టీ నేతగా మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ కన్నౌజ్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైనందున శాసనసభకు ఆయన రాజీనామా చేయనున్నట్లు ఆ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రాజేంద్ర చౌధరి శనివారం వెల్లడించారు. పార్లమెంటరీ పార్టీ నేత ఎన్నిక లాంఛనాలన్నీ దిల్లీలో పూర్తవుతాయన్నారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎస్పీ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 80 స్థానాలకుగాను 37 చోట్ల విజయం సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు