సోనియాగాంధీతో సీఎం రేవంత్‌ భేటీ

దిల్లీలో శనివారం కాంగ్రెస్‌ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు.

Updated : 09 Jun 2024 07:14 IST

సోనియాగాంధీతో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్‌ ఎంపీలు, పార్టీ నేతలు

హైదరాబాద్, న్యూస్‌టుడే: దిల్లీలో శనివారం కాంగ్రెస్‌ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల గురించి ఆమెకు వివరించారు. తాజాగా ఉప ఎన్నికల్లో ఓ ఎమ్మెల్యే స్థానాన్ని, ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకున్నట్లు చెప్పారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్, అనిల్‌కుమార్, బలరాం నాయక్, గడ్డం వంశీకృష్ణను సోనియాకు పరిచయం చేశారు. పార్టీ నేత దిగ్విజయ్‌ సింగ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ ఉన్నారు.

చిత్రంలో సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని సన్మానిస్తున్న రేవంత్‌. చిత్రంలో ప్రియాంకాగాంధీ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని