వైఎస్సార్‌ విగ్రహాలపై దాడి పిరికిపందల చర్య

రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి విగ్రహాలపై అల్లరిమూకలు చేస్తున్న వికృతదాడులను ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు.

Published : 10 Jun 2024 04:50 IST

ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల 

విజయవాడ(గవర్నర్‌పేట), న్యూస్‌టుడే : రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి విగ్రహాలపై అల్లరిమూకలు చేస్తున్న వికృతదాడులను ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణమన్నారు. ఇది పిరికిపందల చర్య తప్ప మరొకటి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హీనమైన చర్యలకు కారణమైనవారిపై వెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు: సీడీ మయప్పన్‌ 

కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైనా పార్టీ నియమాలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి సి.డి.మయప్పన్‌ స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రంలో కొంతమంది నాయకులు మీడియాలో కాంగ్రెస్‌ పార్టీలోని అంతర్గత అంశాలపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు