రాజకీయాల నుంచి తప్పుకొంటున్నా

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు అన్నీ తానై వ్యవహరించిన మాజీ ఐఏఎస్‌ అధికారి, బిజు జనతా దళ్‌ పార్టీ నాయకుడు వి.కార్తికేయ పాండ్యన్‌ రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.

Published : 10 Jun 2024 04:51 IST

బిజద నేతలను క్షమాపణ కోరిన పాండ్యన్‌

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు అన్నీ తానై వ్యవహరించిన మాజీ ఐఏఎస్‌ అధికారి, బిజు జనతా దళ్‌ పార్టీ నాయకుడు వి.కార్తికేయ పాండ్యన్‌ రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తన కారణంగా బిజదకు జరిగిన నష్టానికి పూర్తి బాధ్యత వహిస్తున్నానని, నేతలకు క్షమాపణలు చెబుతున్నానని అందులో పేర్కొన్నారు. నవీన్‌ పట్నాయక్‌కు వయసు మీదపడటంతో పార్టీ వ్యవహారాలన్నీ పాండ్యనే చక్కదిద్దేవారు.  ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందడంతో ఆ వైఫల్యానికి కారణం పాండ్యనే అని పలువురు నేతలు నవీన్‌ పట్నాయక్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని