కాంగ్రెస్‌ ఫిరాయింపుదారు బిట్టుకు మోదీ మంత్రివర్గంలో చోటు

లోక్‌సభ ఎన్నికలకు కొద్ది నెలల ముందు పార్టీ ఫిరాయించిన పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ ఎంపీ రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూకు మోదీ మంత్రివర్గంలో అనూహ్యంగా చోటు దక్కింది.

Published : 10 Jun 2024 05:05 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు కొద్ది నెలల ముందు పార్టీ ఫిరాయించిన పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ ఎంపీ రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూకు మోదీ మంత్రివర్గంలో అనూహ్యంగా చోటు దక్కింది. ఈసారి లోక్‌సభ ఎన్నికలకు కొద్ది నెలల ముందు పార్టీ ఫిరాయించిన నాయకుల్లో మంత్రివర్గంలో చోటు పొందింది ఈయన ఒక్కరే! ఈ ఎన్నికల్లో బిట్టూ పంజాబ్‌లోని లూథియానా నుంచి పోటిచేసి ఓడిపోవడం గమనార్హం. మార్చిలో కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరుతూ.. ‘ప్రజలు మరోసారి మోదీని ప్రధానిగా చూడాలనుకుంటున్నారు’ అని చెప్పారాయన. మూడు సార్లు ఎంపీగా గెలిచిన బిట్టూ.. తాజా ఎన్నికల్లో పంజాబ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమరీందర్‌ సింగ్‌ రాజా వారింగ్‌ చేతిలో 20,942 ఓట్ల తేడాతో ఓడిపోయారు. భాజపా ఈ ఎన్నికల్లో పంజాబ్‌ నుంచి ఒక్క సీటైనా గెలవలేదు. ఆ రాష్ట్రానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండాలనే సమీకరణాల నేపథ్యంలో.. ఓడిపోయినప్పటికీ బిట్టూకి అవకాశం వచ్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని