‘నరేంద్ర విధ్వంసక కూటమి’ నాయకుడు

ఎన్డీయే కూటమి నేత నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అదివారం విమర్శలు గుప్పించింది. ‘నరేంద్ర విధ్వంసక కూటమి’ నేతగా ప్రమాణం చేస్తారంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఆక్షేపించారు.

Published : 10 Jun 2024 05:08 IST

మోదీపై కాంగ్రెస్‌ విమర్శలు

దిల్లీ: ఎన్డీయే కూటమి నేత నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అదివారం విమర్శలు గుప్పించింది. ‘నరేంద్ర విధ్వంసక కూటమి’ నేతగా ప్రమాణం చేస్తారంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఆక్షేపించారు. తనను తాను సామ్రాట్‌గా భావిస్తూ.. గతేడాది కొత్త పార్లమెంటు భవనం ప్రారంభం సందర్భంగా సెంగోల్‌ చేతబూని నడవడం తమిళ ఓటర్లను ఆకట్టుకోవడం లక్ష్యంగా సాగిందన్నారు. అయితే ఆ నాటకాలు ఫలించలేదని పేర్కొన్నారు. మోదీ వ్యక్తిగతంగా, రాజకీయంగా, నైతికంగా ఓటమి పాలయ్యారని ఆక్షేపించారు. గత పదేళ్లుగా సాగిన పరిస్థితి తారుమారవడంతో రాజ్యాంగానికి మోదీ తలవంచక తప్పలేదన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు