తూచ్‌.. మోదీ తొండాట.. నేను గుండు కొట్టించుకోను

‘‘మోదీ మూడోసారి ప్రధాని అయితే గుండు కొట్టించుకొంటా’’ అంటూ లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు భీషణ ప్రతిజ్ఞ చేసిన  ఆప్‌ నేత సోమనాథ్‌ భారతి.. తన మాట ప్రకారం గుండు కొట్టించుకునేందుకు ఆదివారం ససేమిరా అన్నారు.

Updated : 10 Jun 2024 09:05 IST

- ఆప్‌ నేత సోమనాథ్‌ భారతి

దిల్లీ: ‘‘మోదీ మూడోసారి ప్రధాని అయితే గుండు కొట్టించుకొంటా’’ అంటూ లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు భీషణ ప్రతిజ్ఞ చేసిన  ఆప్‌ నేత సోమనాథ్‌ భారతి.. తన మాట ప్రకారం గుండు కొట్టించుకునేందుకు ఆదివారం ససేమిరా అన్నారు. మోదీ మూడోసారి సొంతబలంపై ప్రధాని కాలేదని, మిత్రపక్షాల ఊతంతోనే మళ్లీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టారని వాదించారు. అంతకుముందు భాజపా దిల్లీ అధికార ప్రతినిధి ప్రవీణ్‌ శంకర్‌ కపూర్‌ ‘ఎక్స్‌’ ద్వారా ఓ పోస్టు చేస్తూ ‘భారతీ గారూ! తక్షణం గుండు కొట్టించుకోండి. అయినా ఆప్‌ నేతలు మాట మీద నిలబడరని మాకు తెలుసు’’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని