లోకేశ్‌ను కలిసిన ఎన్నికైన ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 11 Jun 2024 03:43 IST

ఈనాడు డిజిటల్, అమరావతి: తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. యువగళం పాదయాత్రతో రాష్ట్రంలో ఎన్డీయే విజయానికి లోకేశ్‌ కృషి చేశారని నేతలు కొనియాడారు. ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించారు. లోకేశ్‌ను కలిసిన వారిలో బెందాళం అశోక్, జ్యోతుల నెహ్రూ, బీవీ జయనాగేశ్వరరెడ్డి, చదలవాడ అరవిందబాబు తదితరులున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని