కీలక దస్త్రాల అదృశ్యంపై దర్యాప్తు చేయాలి: సీపీఐ

రాష్ట్రంలో పలు శాఖలు, విభాగాల్లో కీలక పత్రాలను మాయం చేయడం, దగ్ధం చేయడంపై దర్యాప్తు జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

Updated : 11 Jun 2024 06:38 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పలు శాఖలు, విభాగాల్లో కీలక పత్రాలను మాయం చేయడం, దగ్ధం చేయడంపై దర్యాప్తు జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ‘‘ఇసుక, గనులు, మద్యం తదితర విభాగాల్లో కుంభకోణాలు జరిగాయి. రూ.వేల కోట్ల అవినీతి జరిగి ప్రజాధనం దుర్వినియోగమైంది. పలువురు అధికారులు వైకాపా ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి, ఆయా శాఖలు, కార్పొరేషన్‌ల నిధులను దారిమళ్లించారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది: సిరిపురపు శ్రీధర్‌శర్మ

ఈనాడు డిజిటల్, అమరావతి: స్వరూపానంద స్వామిని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌శర్మ మండిపడ్డారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. జగన్‌ అండతో ఆయన కబ్జా చేసిన భూముల్ని కొత్త ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.  


అధికారం పోయాక ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా?
తెదేపా బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుచ్చిరాంప్రసాద్‌ 
ఈనాడు డిజిటల్, అమరావతి: అధికారం పోయాక వైకాపా నేతలకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గుర్తొచ్చాయా అని తెదేపా బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుచ్చిరాంప్రసాద్‌ ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లు ప్రతిపక్ష నేతలపై దాడులకు పాల్పడుతూ, వారి ఆస్తుల్ని ధ్వంసం చేసిన వాళ్లు.. నేడు ప్రెస్‌మీట్‌లు పెట్టి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కూడా వైకాపా శ్రేణుల బుద్ధి మారలేదని.. కర్నూలులో గిరినాథ్‌చౌదరి అనే తెదేపా కార్యకర్తని పొట్టనపెట్టుకున్నారని సోమవారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని