టీచర్ల బదిలీల్లో అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు

ఎన్నికల ముందు ఉపాధ్యాయుల బదిలీల పేరిట భారీ అవినీతి జరిగిందని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.

Published : 11 Jun 2024 03:49 IST

రూ.50 కోట్లు దండుకున్నారని వర్ల రామయ్య ఆరోపణ

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై ఏసీబీ ఎస్పీ రవిప్రకాశ్‌కు ఫిర్యాదు
చేస్తున్న తెదేపా నేత వర్ల రామయ్య తదితరులు

ఈనాడు డిజిటల్, అమరావతి: ఎన్నికల ముందు ఉపాధ్యాయుల బదిలీల పేరిట భారీ అవినీతి జరిగిందని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. విద్యాశాఖలోని కీలక అధికారికీ ఇందులో భాగస్వామ్యం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సోమవారం విజయవాడలోని ఏసీబీ ఎస్పీ రవిప్రకాశ్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. ‘మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన పీఏ, పలువురు ఉన్నతాధికారులు ఉపాధ్యాయులు ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.3 నుంచి 6 లక్షలు వసూలు చేశారు. ఇప్పుడు ఆ ఉపాధ్యాయులంతా లబోదిబోమంటున్నారు. దోచుకున్న సొమ్మును తిరిగివ్వాలంటూ వసూలు చేసిన వారి ఇళ్లపై దాడి చేయడానికీ సిద్ధపడుతున్నారు. బదిలీ అయిన ఉపాధ్యాయుల్ని విచారిస్తే ఇందులో చక్రం తిప్పిన ఆ కీలక అధికారి ఎవరో బయటపడుతుంది. అవినీతికి పాల్పడ్డ ఏ మంత్రినీ వదిలే ప్రసక్తి లేదు. మహిళా మంత్రులైనా సరే జైలుకు వెళ్లాల్సిందే’ అని వర్ల రామయ్య హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని