మీరు జాగ్రత్తపడండి.. తెదేపా, జేడీయూలకు ఒమర్‌ అబ్దుల్లా సూచన

తెదేపా, జేడీయూల మద్దతు అవసరం లేకుండానే కేంద్రంలో సర్కారును నడిపే సొంతబలం కోసం భాజపా ప్రయత్నించొచ్చని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు.

Published : 11 Jun 2024 04:47 IST

శ్రీనగర్‌: తెదేపా, జేడీయూల మద్దతు అవసరం లేకుండానే కేంద్రంలో సర్కారును నడిపే సొంతబలం కోసం భాజపా ప్రయత్నించొచ్చని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. అందువల్ల ఈ రెండు పార్టీలూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఎన్డీయేలో కీలక భాగస్వాములుగా ఉన్న తెదేపా, జేడీయూలపై మున్ముందు ఆధారపడే పరిస్థితి రాకుండా ‘ఆపరేషన్‌ కమల్‌’ను భాజపా ప్రారంభించే రోజు ఎంతో దూరంలో లేదని, ఈ పార్టీలు ఆలోగానే అప్రమత్తం కావాలని పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో సలహా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని