రాహుల్‌ కృతజ్ఞత కార్యక్రమం రాయ్‌బరేలీకి మార్పు

ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపడానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా గాంధీ మంగళవారం అమేఠీలో నిర్వహించతలపెట్టిన కార్యక్రమాన్ని రాయ్‌బరేలీకి మార్చారు.

Published : 11 Jun 2024 04:48 IST

అమేఠీ: ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపడానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా గాంధీ మంగళవారం అమేఠీలో నిర్వహించతలపెట్టిన కార్యక్రమాన్ని రాయ్‌బరేలీకి మార్చారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ గాంధీ, అమేఠీ నుంచి హస్తం పార్టీ అభ్యర్థి కిశోరీలాల్‌ శర్మ గెలుపొందారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలకు ధన్యవాదాలు చెప్పడానికి అమేఠీలో కార్యక్రమాన్ని నిర్వహించాలని ముందుగా భావించారు. కానీ అక్కడ ఎండ వేడిమి ఎక్కువ ఉండడంతో తాజాగా రాయ్‌బరేలీకి మార్చామని, మంగళవారం అక్కడ ఓ అతిథిగృహంలో నిర్వహించనున్నామని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి రాహుల్, ప్రియాంకా గాంధీతో పాటు అమేఠీ ఎంపీ కిశోరీలాల్‌ శర్మ కూడా హాజరవుతారని పేర్కొన్నాయి. 


రేపు వయనాడ్‌లో రాహుల్‌ పర్యటన

తిరువనంతపురం: రాహుల్‌ గాంధీ బుధవారం కేరళలోని వయనాడ్‌లో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు పార్టీవర్గాలు సోమవారం తెలిపాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్, రాయ్‌బరేలీ నియోజకవర్గాల నుంచి రాహుల్‌ గెలుపొందిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని