వైకాపా వాళ్లకు ఐపీసీ సెక్షన్ల పవరేంటో చూపిస్తాం

ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి, విధ్వంసకాండకు పాల్పడిన వైకాపా నాయకులు, పిల్ల సైకోలు.. నిబంధనల్ని గాలికొదిలి వైకాపా తొత్తుల్లా వ్యవహరించిన అధికారులు, పోలీసులకు ఐపీసీ సెక్షన్ల పవరేంటో చూపిస్తామని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ హెచ్చరించారు.

Published : 11 Jun 2024 05:25 IST

గిరినాథ్‌ చౌదరిని చంపింది వైకాపా రౌడీమూకలే 
తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌  

ఈనాడు డిజిటల్, అమరావతి: ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి, విధ్వంసకాండకు పాల్పడిన వైకాపా నాయకులు, పిల్ల సైకోలు.. నిబంధనల్ని గాలికొదిలి వైకాపా తొత్తుల్లా వ్యవహరించిన అధికారులు, పోలీసులకు ఐపీసీ సెక్షన్ల పవరేంటో చూపిస్తామని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ హెచ్చరించారు. ఇప్పటికీ వైకాపా అరాచకాలను వీడలేదని.. కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లెకి చెందిన తెదేపా కార్యకర్త గిరినాథ్‌ చౌదరిని మాజీ ఎమ్మెల్యే కంగాలి శ్రీదేవి అనుచరులు దారుణంగా హత్య చేశారని మండిపడ్డారు. జే గ్యాంగులా తెదేపా వారు భౌతికదాడులకు పాల్పడటం, హత్యలు చేయించడం, ఆస్తులు ధ్వంసం చేయడం లాంటి పనులు చేయరని.. చంద్రబాబు తరఫున ఆ హామీ తానిస్తున్నట్టు స్పష్టం చేశారు. లోకేశ్‌ రెడ్‌బుక్‌ రియాల్టీ అని.. అందులో ఉన్న ప్రతి పిల్లసైకోకు, అవినీతి అధికారికీ బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కొడాలి నాని, పేర్ని నాని లాంటి వాళ్లు సిగ్గు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ మాట్లాడుతున్నారు. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి చేసినప్పుడు, చంద్రబాబు ఇంటిపైకి దండెత్తినప్పుడు, తెదేపా అధినేత పర్యటనల్లో రాళ్లు, కర్రలు విసిరినప్పుడు, మాచర్లలో తెదేపా వారిపై దాడులు చేసినప్పుడు, చెన్నుపాటి గాంధీ కంటిని తీవ్రంగా గాయపర్చినప్పుడు మీకు ప్రజాస్వామ్యం విలువ తెలియదా’ అని ప్రశ్నించారు. ‘దేవినేని అవినాష్‌ నా ఇల్లు ధ్వంసం చేశారు. నా ఎనిమిదేళ్ల బిడ్డను భయపెట్టారు. గుణదలలో ఆయన చేసిన సెటిల్‌మెంట్లు, భూదందాల జాబితా మా దగ్గర ఉంది. ఆయనతో పాటు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్‌కుమార్‌ యాదవ్, జోగి రమేశ్‌ ఎవర్నీ వదలం. వాళ్లందర్నీ జైలుకు పంపుతాం’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని