రాజకీయాల నుంచి వైదొలుగుతా..

ఇటీవల ఎన్నికల్లో తాను ఓటమి పాలైనా, తిరువనంతపురం అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. అందుకు సంబంధించి తన వద్ద 100 రోజుల ప్రణాళిక సిద్ధంగా ఉందన్నారు.

Updated : 11 Jun 2024 06:06 IST

కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ట్వీట్‌.. ఆపై డిలీట్‌

తిరువనంతపురం: ఇటీవల ఎన్నికల్లో తాను ఓటమి పాలైనా, తిరువనంతపురం అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. అందుకు సంబంధించి తన వద్ద 100 రోజుల ప్రణాళిక సిద్ధంగా ఉందన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ‘ఎక్స్‌’లో రాసుకొచ్చారు. అంతకుముందు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు అర్థం వచ్చేలా ఓ పోస్టు చేశారు. కానీ, దానిపై తీవ్ర చర్చ జరగడంతో వెంటనే ఆయన దాన్ని డిలీట్‌ చేసి.. ‘గత ట్వీట్‌తో కొందరు నన్ను అపార్థం చేసుకున్నారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా పదవీకాలం పూర్తయిందని మాత్రమే నా ఉద్దేశం. జయాపజయాలతో సంబంధం లేకుండా తిరువనంతపురంతోపాటు దేశ అభివృద్ధికి పాటుపడతాను’ అని మరో పోస్టు చేశారు. రాజకీయాల నుంచి చంద్రశేఖర్‌ వైదొలుగుతున్నట్లు వచ్చిన వార్తలపై ఎన్నికల్లో ఆయన మీద విజయం సాధించిన శశిథరూర్‌ స్పందించారు. ‘ఆయన సామర్థ్యంపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. దేశ పురోగతికి మరిన్ని సేవలు అందించగలరు. అధికారం అనేది దానికో మార్గం మాత్రమే’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని