2021 జనాభా గణన లేక.. 14 కోట్ల మంది ఆహార భద్రతకు దూరం: కాంగ్రెస్‌

నవీకరించిన జనాభా గణనను ఎప్పుడు నిర్వహిస్తారో ప్రధాని మోదీ దేశానికి తెలియజేయాలని, ఓబీసీల జనాభాకు సంబంధించిన డేటాను అందించాలని కాంగ్రెస్‌ సోమవారం కోరింది.

Updated : 11 Jun 2024 06:32 IST

దిల్లీ: నవీకరించిన జనాభా గణనను ఎప్పుడు నిర్వహిస్తారో ప్రధాని మోదీ దేశానికి తెలియజేయాలని, ఓబీసీల జనాభాకు సంబంధించిన డేటాను అందించాలని కాంగ్రెస్‌ సోమవారం కోరింది. సామాజిక ఆర్థికాభివృద్ధికి అవసరమైన సమగ్ర జనాభా గణనను ప్రతి పదేళ్లకోసారి చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ అన్నారు. ఈ మేరకు చివరి జనాభా గణనను 2021లో పూర్తి చేయాల్సి ఉందన్నారు. కానీ మోదీ దానిని పూర్తి చేయకపోవడంతో దాదాపు 14 కోట్ల మంది భారతీయులు ‘గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన’గా మార్చిన జాతీయ ఆహార భద్రత చట్టం-2013 ప్రయోజనాలను కోల్పోతున్నారని చెప్పారు. జనాభా గణన ఎప్పుడు చేపడతారో ప్రధాని దేశానికి తెలపాలని కోరారు. జనాభా గణన రాజ్యాంగంలో పొందుపరిచిన సామాజిక న్యాయానికి నిజమైన అర్థాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ తన లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో దేశవ్యాప్తంగా కులాల సర్వే నిర్వహిస్తామని హామీ ఇచ్చిందని జైరాం గుర్తు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని