21న ఖమ్మంలో తెదేపా సభ: కాసాని

ఖమ్మంలో వచ్చే నెల 21న బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ తెలిపారు.

Updated : 27 Nov 2022 05:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఖమ్మంలో వచ్చే నెల 21న బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ తెలిపారు. శనివారం ఎన్టీఆర్‌ భవన్‌లో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.   ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం ద్వారా గ్రామగ్రామాన పార్టీ జెండాను ఎగురవేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో బస్సుయాత్ర నిర్వహిస్తామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ ఇది కొనసాగుతుందన్నారు.  తెరాస నేతలు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ప్రజలు భావిస్తున్నారని, ధరణి పోర్టల్‌తో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పార్టీ రాష్ట్ర సమన్వయకర్త కంభంపాటి రాంమోహన్‌రావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నగరంలోని కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు కాసాని సమక్షంలో తెదేపాలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని