కేసీఆర్‌ సర్కారే శ్రీరామరక్ష

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాది డబుల్‌ ఇంజిన్‌ కాదని ట్రబుల్‌ ఇంజిన్‌ అని.. పేదలకు కేసీఆర్‌ సర్కారే శ్రీరామరక్ష అని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

Published : 04 Dec 2022 05:12 IST

 కేంద్రంలో భాజపాది ట్రబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌: హరీశ్‌రావు

జుక్కల్‌, మద్నూర్‌, న్యూస్‌టుడే: కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాది డబుల్‌ ఇంజిన్‌ కాదని ట్రబుల్‌ ఇంజిన్‌ అని.. పేదలకు కేసీఆర్‌ సర్కారే శ్రీరామరక్ష అని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. పిట్లంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన, బిచ్కుందలో డయాలసిస్‌ కేంద్రం, డోంగ్లిలో తహసీల్దార్‌ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా డోంగ్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని, రైతుల నుంచి ముక్కుపిండి బిల్లులు వసూలు చేసిస్తే.. ఏడాదికి రూ.6 వేల కోట్ల చొప్పున అయిదేళ్లకు రూ.30 వేల కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పిందని ఆయన అన్నారు. మీటర్లు పెట్టాలా అని రైతులను ప్రశ్నించారు. వారు స్పందించి వద్దని చెప్పారు. కేసీఆర్‌ కూడా అదే చెప్పారని, కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు బోర్ల వద్ద మీటర్లను పెట్టనిచ్చేది లేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ శోభ, ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని