ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తిరగబడాలి

ఏపీలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడేలా గ్రామీణుల్లో చైతన్యం తీసుకురావాలని అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగర తెదేపా నూతన కమిటీ సభ్యులకు ప్రవాసాంధ్ర తెదేపా యూఎస్‌ఏ సమన్వయకర్త జయరాం కోమటి పిలుపునిచ్చారు.

Updated : 07 Dec 2022 06:19 IST

ప్రవాసాంధ్ర తెదేపా యూఎస్‌ఏ సమన్వయకర్త జయరాం కోమటి

ఈనాడు, అమరావతి: ఏపీలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడేలా గ్రామీణుల్లో చైతన్యం తీసుకురావాలని అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగర తెదేపా నూతన కమిటీ సభ్యులకు ప్రవాసాంధ్ర తెదేపా యూఎస్‌ఏ సమన్వయకర్త జయరాం కోమటి పిలుపునిచ్చారు. కొత్త కమిటీ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ఏపీలో చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరం. అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా తెదేపా నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతోంది. పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలి. ఏపీలో నేరం, రాజకీయం జంటగా అంటకాగుతున్నాయి. అవినీతి, స్వార్థ రాజకీయాల్లో చిక్కిన రాష్ట్రానికి మూడున్నరేళ్లుగా ఊపిరాడటం లేదు’ అని జయరాం అన్నారు. ‘జగన్‌రెడ్డి పాలనలో ఏపీలో అవినీతి, అశ్రిత పక్షపాతం పెరిగింది. జీ-20 దేశాల సదస్సుపై ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చంద్రబాబు విజన్‌ను ప్రధాని ప్రశంసించడం ఆయన పనితీరుకు నిదర్శనం’ అని ప్రవాసాంధ్ర తెదేపా యూఎస్‌ఏ మరో నాయకుడు మన్నవ సుబ్బారావు అన్నారు. తెదేపా టాంపా నగర అధ్యక్షుడిగా సుధాకర్‌ మున్నంగి, ఉపాధ్యక్షుడిగా రామ్మోహన్‌ కర్పూరపు, ప్రధాన కార్యదర్శిగా స్వరూప్‌ అంచె, కోశాధికారిగా చంద్ర పెద్దు, సామాజిక మాధ్యమాల సమన్వయకర్తగా నాగ సుమంత్‌ రామినేని, ప్రాంతీయ మండల ప్రతినిధిగా అజయ్‌ దండమూడి నియమితులయ్యారు.

తెదేపా కొత్త కమిటీల నియామకం

అమెరికాలోని మరో మూడు నగరాల్లో తెదేపా కార్యనిర్వాహక కమిటీలను పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంగళవారం ప్రకటించారు.

ఎన్‌ఆర్‌ఐ తెదేపా హారిస్‌బర్గ్‌

అధ్యక్షునిగా సందు అంచ, ఉపాధ్యక్షుడిగా వెంకట్‌ ముప్పా, ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్‌ జంపన, కోశాధికారిగా ఉపేంద్ర దేవినేని, ప్రాంతీయ మండలి ప్రతినిధిగా సతీశ్‌ చుండ్రు, సామాజిక మాధ్యమ సమన్వయకర్తగా వెంకట్‌ సింగ్‌ నియమితులయ్యారు.

హ్యూస్టన్‌: అధ్యక్షునిగా ప్రసాద్‌ యార్లగడ్డ, ఉపాధ్యక్షుడిగా పద్మజ వసంత, ప్రధాన కార్యదర్శిగా పురుషోత్తం ఇనేని, కోశాధికారిగా జీవీఎస్‌ ప్రసాద్‌, ప్రాంతీయ మండలి ప్రతినిధిగా మనోజ్‌ పాలడుగు, సామాజిక మాధ్యమ సమన్వయకర్తగా చంద్రకాంత్‌ జంపాల నియమితులయ్యారు.

లాస్‌ఏంజెలిస్‌: అధ్యక్షునిగా వెంకట సుబ్బారావు ఆళ్ల, ఉపాధ్యక్షుడిగా సురేశ్‌ అంబటి, ప్రధాన కార్యదర్శిగా రాహుల్‌ వాసిరెడ్డి, కోశాధికారిగా విష్ణు అటుకారి, ప్రాంతీయ మండలి ప్రతినిధిగా చందు నంగినేని, సామాజిక మాధ్యమ సమన్వయకర్తగా హేమకుమార్‌ గొట్టి నియమితులయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని