CM Revanth reddy: సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ సహా ప్రముఖుల శుభాకాంక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 07 Dec 2023 17:59 IST

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

  • ‘‘తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా శ్రేయస్సుకు కావాల్సిన పూర్తి తోడ్పాటు అందిస్తాం’’ - ప్రధాని మోదీ
  • ‘‘తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణ స్వీకారం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ - ఏపీ సీఎం జగన్‌
  • ‘‘తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు. ప్రజలకు మెరుగైన సేవలందించాలని కోరుకుంటున్నా. మీ పరిపాలన ప్రజారంజకంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా. ప్రజా సేవ చేసే దిశగా మీ భవిష్యత్తు విజయవంతం కావాలి’’ - తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు

  • ‘‘తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు. అన్ని పక్షాలను కలుపుకొని వెళుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి. ప్రజా శ్రేయస్సు, అభివృద్ధే లక్ష్యంగా సుపరిపాలన కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నా’’ - మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు

  • ‘‘సీఎం రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన భట్టి విక్రమార్క, మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ అభినందనలు. హమీల అమలు దిశగా ప్రభుత్వం పనిచేయాలని ఆకాంక్షిస్తున్నా’’- హరీశ్‌రావు
  • ‘‘తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన రేవంత్‌రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన మంత్రి వర్గ సహచరులకు శుభాభినందనలు. వాగ్దాటి, ప్రజాకర్షణ కలిగిన నేత రేవంత్‌రెడ్డి. రాజకీయంగా ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొని సీఎం స్థాయికి ఎదిగారు. తెలంగాణలో జరిగిన ఉద్యమాలపై సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు. రాష్ట్ర సాధన కోసం అమరులైన యువత..  ఏ ఆశయాల కోసం ఆత్మబలిదానాలు చేసిందో వాటిని సంపూర్ణంగా నెరవేర్చి ఆ త్యాగాలకు గౌరవాన్ని, సార్థకతను కల్పించాలి’’ - జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
  • ‘‘తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు. తన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షిస్తున్నా’’ - తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

  • ‘‘సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌డ్డికి అభినందనలు. తెలంగాణ మంత్రులకు శుభాభినందనలు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉంది. తెలంగాణ అభివృద్ధిని విజయవంతంగా కొనసాగిస్తారని ఆశిస్తున్నా’’ - నందమూరి రామకృష్ణ

  • ‘‘తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధించాలి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు’’  -సినీ నటుడు చిరంజీవి

  • ‘‘తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డికి అభినందనలు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నా. ప్రమాణ స్వీకారం చేసిన సీతక్క, ఇతర మంత్రులందరికీ అభినందనలు’’ -  గాయని స్మిత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని