గుడివాడలో కొడాలి నానికి షాక్‌.. తెదేపాలో చేరిన వైకాపా ముఖ్య నేత

కృష్ణా జిల్లా గుడివాడలో వైకాపా ఎమ్మెల్యే కొడాలి నానికి షాక్‌ తగిలింది. ఆ నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేత షేక్‌ మౌలాలి తెదేపాలో చేరారు.

Published : 13 Apr 2024 14:00 IST

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడలో వైకాపా ఎమ్మెల్యే కొడాలి నానికి షాక్‌ తగిలింది. నియోజకర్గంలో ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత షేక్‌ మౌలాలి తెదేపాలో చేరారు. ఆయనతో పాటు అనుచరులకు గుడివాడ తెదేపా అభ్యర్థి వెనిగండ్ల రాము పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

అనంతరం రాము మాట్లాడుతూ ప్రజలకు మంచి చేసేందుకు మౌలాలి లాంటి వ్యక్తులు తెదేపాలోకి వస్తున్నారన్నారు. నాని పచ్చి మోసగాడని.. అవసరం తీరాక వదిలేస్తాడని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ‘‘కొడాలి నాని ఆడుతున్న డ్రామాలు ఎక్కువ రోజులు సాగవు. ప్రజలకు అబద్ధాలు చెప్పడంలో సీఎం జగన్‌ మొదటి స్థానంలో.. నాని రెండో స్థానంలో ఉన్నారు. అభివృద్ధి గురించి పట్టించుకోకుండా అరాచకానికే వైకాపా ప్రాధాన్యమిస్తోంది. రోడ్లపై గుంతలు పూడ్చలేని ప్రభుత్వం.. మూడు రాజధానుల పేరుతో మోసం చేస్తోంది. గుడివాడ అభివృద్ధి చెంది భావితరాలు బాగుండాలంటే ప్రజలంతా చంద్రబాబుకు మద్దతుగా నిలవాలి’’ అని వెనిగండ్ల రాము కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని