Harish Rao: అట్టహాసంగా నియామక పత్రాలిచ్చారు.. 4 నెలలుగా జీతాలివ్వలేదు: హరీశ్‌రావు

నర్సింగ్‌ ఆఫీసర్లకు కాంగ్రెస్‌ ప్రభుత్వం 4 నెలలుగా జీతాలివ్వలేదని భారాస నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా విమర్శించారు.

Updated : 21 May 2024 10:59 IST

హైదరాబాద్‌: నర్సింగ్‌ ఆఫీసర్లకు కాంగ్రెస్‌ ప్రభుత్వం 4 నెలలుగా జీతాలివ్వలేదని భారాస నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా విమర్శించారు. భారాస హయాంలో చేసిన రిక్రూట్‌మెంట్‌ను ఈ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుందని ఆరోపించారు. ఎల్బీ స్టేడియం వద్ద అట్టహాసంగా నియామక పత్రాలిచ్చి.. జీతభత్యాలను పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. జీతాలందక 4 వేల మంది నర్సింగ్‌ ఆఫీసర్లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలిస్తామని కాంగ్రెస్‌ నేతలు గొప్పలు చెప్పారన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించి.. పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల జీతాలను తక్షణమే చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని