Tammineni veerabhadram: తమ్మినేని వీరభద్రానికి గుండెపోటు.. హైదరాబాద్‌కు తరలింపు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి గుండెపోటు వచ్చింది.

Updated : 16 Jan 2024 19:10 IST

ఖమ్మం: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి గుండెపోటు వచ్చింది. ఖమ్మంలో ఉండగా ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో మొదట ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ప్రస్తుతం ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తమ్మినేనికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని.. కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు రావొద్దని పార్టీ రాష్ట్ర కమిటీ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.

ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న వీరభద్రాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై  వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు