Janasena: జనసేనకు హైకోర్టులో ఊరట.. గుర్తు కేటాయింపుపై దాఖలైన పిటిషన్‌ కొట్టివేత

జనసేనకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆ పార్టీకే గ్లాస్ గుర్తు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసింది.

Published : 16 Apr 2024 13:17 IST

అమరావతి: జనసేనకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆ పార్టీకే గ్లాస్ గుర్తు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసింది. జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) ఫౌండర్ ప్రెసిడెంట్ వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. ఇరుపక్షాల వాదనలు విని ఇటీవల తీర్పును రిజర్వు చేసింది. తాజాగా గ్లాస్‌ గుర్తును జనసేనకే కేటాయిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. గుర్తు కేటాయింపును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని